వట్రువ

'కాఫీ' అంటు అరుస్తు నిద్ర నుంచి లేచాడు డి.ఎస్.పి సుధర్శన రావు. రాత్రి అంత కరోనా డ్యూటి నుంచి లేటుగా వచ్చి పడుకొని అప్పుడే లేచిన సుదర్శన రావు, టైము చూస్తె ఉదయం 8 గం అయ్యింది. లేవగానె బెడ్డు కాఫి తాగక పోతె ఆయనకు కాల కృత్యాలు సరిగ్గ జరగవు. అతనికి అలా లవాటయ్యింది. వంటింట్లో నుంచి  ఆయన భార్య మహలక్ష్మమ్మ "మీరొకరు, మహేశ్వరి ఈరొజు పనికి రాలేదు. ఇంటిపని , వంటపని రెండు చేసుకోలేక నేను చస్తున్నాను. మీకేం మగమహరాజులు, బయటకెల్లి తింటారు. త్రాగుతారు. మా ఆడవాళ్ళకె అన్ని కష్టాలు" అంటు కోపముతొ విసుక్కోవటం జరిగింది.

అసలే టైము టంతొ హడావుడిగ ఆఫీసుకు వెళ్ళీన డి.ఎస్.పి సుదర్శనరావుకు కాఫీ త్రాగక పొవము , పైగ భార్య విసుక్కొవటం తొ చాల చిరాకుగ వుంది. దానికి తోడు పనికి ఇంత లేటుగ రావము,ఒక్కరికి రెస్పాన్సిబిలిటి లేదు” అని ఎస్.పి దామోదరరెడ్డి అన్న  మాటలు ఇంక అతని కోపాన్ని పెంచాయి. కోపాన్ని వెంటనె అతను తన సర్కిల్లో  ఉన్న సీ. ఐ రామానుజం మీద చూపటం జరిగింది. కారణం లేకుం తనను తిట్తున్న డి.ఎస్.పి ని ఏమన లేక బయటకు వెళ్ళి  పోయాడు సీ. ఐ రామానుజం. వెంటనె అతను అకడ ఉన్న ఎస్. కోదండాన్ని పిలిచి, " ఇడియట్, పని చెప్పిన సరిగ్గ చెయ్యవు. మీకెందుకురా పోలీసు ఉద్యోగాలు" అంటు అందరి ముందు అరవటం మొదలు పెట్టాడు. తన క్రింది పోలీసుల ముందు ఆయన అలా అరవటంతో  కోదండానికి తల కొట్టేసినట్టు అయ్యింది.

అతను వెళ్ళి పోయిన తర్వాత, అప్పుడు అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబులు  సుబ్బరామయ్యను పిలచి,నీ ఏరియాలొ టాస్మాకు షాపు దగ్గర గొడవ జరుగుతుందటగా, మీరంతా ఏం చేస్తున్నారు? అన్ని నేనే  చూసుకోవల్సిందేనా. నీ పనేంది. కొమ్ములు పీకుతున్నావా. వయసు వచ్చింది దున్నపోతులాగ. మీరంత పనికి రారు” అని అరవటం మొదలు పెట్టాడు.

 

తన వయసుకు కూడ మర్యాద ఇవ్వకుండ అందరి ముందు తనని అలా అరవటంతో  కోపం వచ్చిన  సుబ్బరామయ్య ఇంకేం చెప్పకుండ  స్టేషను బయటకు వచి అటు వెల్లుతున్న ఆటో వాడిని పిలచి,నీ మాస్కు ఏదిరా. లైసెన్సు ఏది, అన్నిడాక్యుమెంట్సు  చూపించుఅని అడిగాడు. తర్వాత లైసెన్సు చూసి, “. నీ పేరు ముత్తా. మిగతా డాక్యుమెంట్సు ఎక్కడరా. నీ దగ్గర ఎంత ఉంది”, అని, 500 రూపాయలు లాక్కొని ,”ఇంకా పోరా”.అని అరిచాడు .ఏదొ మాట్లాడ బోయిన ముత్తును లాఠితొ తట్టి, ఇక్కడుంటె లోపల పడేస్త. పో అని అరిచాడు. పై పాకెట్టులో ఉన్న డబ్బులు పోగుట్టుకున్న ముత్తు అక్కడె ఉన్న టాస్మాకు షాపు  ఫుల్లుగ తాగి ఇంటికి వచ్చాడు .

 

"ఏమయ్యా, ఈ రోజు ఇంత సేపయ్యింది. మల్ల ఫుల్లుగ తాగి వచ్చావా. అసలే బియ్యం నిండుకున్నయి. పిల్లాడికి ఫీసు కట్టాలి. పిల్లకు చాల జ్వరము. నాకు ఒల్లు బాగ లేదు. నేను ఒక్కతినే సంపాయించి ఇల్లు గడపాలి. నీవేమో తాగి వస్తున్నావు. ఇలా అయ్యితె ఎలా. కొంచెమయిన  బాధ్యత ఉందా”, అని అడిగింది. అసలే కోపముగ ఉన్న ముత్తు వెంటనే,” ఏమే  లం…..నాకే ఎదురు చెప్తావా. నీ పని చెప్తాను” అంటు బాద సాగాడు. దెబ్బలతొ సొమ్మసిల్లి పడిపోయిన మహేశ్వరి  ప్రక్క రోజు ఒళ్ళు నొప్పులతో మహలక్ష్మమ్మ ఇంటికి పనికి పోలేక పోయింది. మరేం ఉంది. ప్రక్క రోజు కథ పునరావృత్తం.

Comments

Popular posts from this blog