Posts

Showing posts from June, 2020
నాన్న ప్రేమ ‘ రవి ’ " నన్ను ఎవరో తాకిరి , కన్ను   ఎవరో కలిపిరి , చూపులోనె ఆపలేని మత్తు మందు జల్లిరి ,   నన్ను ఎవరో చూసిరి , కన్నె మనసే దోచిరి , చూపులోనె ఆపలేని మత్తు మందు జల్లిరి ,"   అత్త చేతిలో ఉన్న మర్ఫి బ్రాండు ట్రాన్సిస్టరు లోంచి వినపడుతున్న ఘంటసాల , సుశీల గొంతుకల లోని మార్ధవం నా కాళ్ళను అటు వైపుకి లాగింది . అప్పుడు   సుమారు రాత్రి 8 గంటల 10 నిముషాలు అవుతున్నది . ఇంతలో వ్యాఖ్యాత   మాటలు ' మీరు వింటున్న ఈ పాట   సత్తెకాలపు సత్తెయ్య చలన చిత్రము లోనిది ., గాయకులు ఘంటసాల , సుశీల ,   వ్రాసినది ఆరుద్రగారు , సంగీత దర్శకుడు ఎం ఎస్ విశ్వనాథన్ గారు ' అని వినపడుతుండగ,    ' అమ్మా ' అని గట్టిగా బాధతో   అరిచాను . ఆ కేక విన్న అత్త వెంటనే పట్టుకొన్న ట్రాన్సిస్టరును కింద పడవేసి ' ఏమయ్యింది కిష్టయ్య ' అని ఆదుర్దాగ అడిగింది . అప్పుడే వెళ్ళుతున్న   పెద్ద తేలు నన్ను కాలి మీద కాటు వేసింది . గుడ్డి దీపము వెలుగులో దాని చూసిన అత్త పిల్లవాడికి తేలు కుట్టిందని చెప్పింది . ఇ