Posts

వట్రువ

' కాఫీ ' అంటు అరుస్తు నిద్ర నుంచి లేచాడు డి . ఎస్ . పి సుధర్శన రావు . రాత్రి అంత కరోనా డ్యూటి నుంచి లేటుగా వచ్చి పడుకొని అప్పుడే లేచిన సుదర్శన రావు, టైము చూస్తె ఉదయం 8 గం అయ్యింది . లేవగానె బెడ్డు కాఫి తాగక పోతె ఆయనకు కాల కృత్యాలు సరిగ్గ జరగవు. అతనికి అలా అ లవాటయ్యింది . వంటింట్లో నుంచి   ఆయన భార్య మహలక్ష్మమ్మ " మీరొకరు , మహేశ్వరి ఈరొజు పనికి రాలేదు . ఇంటిపని , వంటపని రెండు చేసుకోలేక నేను చస్తున్నాను . మీకేం మగమహరాజులు , బయటకెల్లి తింటారు . త్రాగుతారు . మా ఆడవాళ్ళకె అన్ని కష్టాలు " అంటు కోపముతొ విసుక్కోవటం జరిగింది . అసలే టైము అ వ టంతొ హడావుడిగ ఆఫీసుకు వెళ్ళీన డి . ఎస్ . పి సుదర్శనరావుకు కాఫీ త్రాగక పొవ ట ము , పైగ భార్య విసుక్కొవటం తొ చాల చిరాకుగ వుంది . దానికి తోడు పనికి ఇంత లేటుగ రావ ట ము, “ ఒక్కరికి రెస్పాన్సిబిలిటి లేదు” అని ఎస్ . పి దామోదరరెడ్డి అన్న   మాటలు ఇంక అతని కోపాన్ని పెంచాయి . ఆ కోపాన్ని వెంటనె అతను తన సర్కిల్లో   ఉన్న సీ. ఐ రామానుజం మీద చూపటం జరిగింది . కార
నాన్న ప్రేమ ‘ రవి ’ " నన్ను ఎవరో తాకిరి , కన్ను   ఎవరో కలిపిరి , చూపులోనె ఆపలేని మత్తు మందు జల్లిరి ,   నన్ను ఎవరో చూసిరి , కన్నె మనసే దోచిరి , చూపులోనె ఆపలేని మత్తు మందు జల్లిరి ,"   అత్త చేతిలో ఉన్న మర్ఫి బ్రాండు ట్రాన్సిస్టరు లోంచి వినపడుతున్న ఘంటసాల , సుశీల గొంతుకల లోని మార్ధవం నా కాళ్ళను అటు వైపుకి లాగింది . అప్పుడు   సుమారు రాత్రి 8 గంటల 10 నిముషాలు అవుతున్నది . ఇంతలో వ్యాఖ్యాత   మాటలు ' మీరు వింటున్న ఈ పాట   సత్తెకాలపు సత్తెయ్య చలన చిత్రము లోనిది ., గాయకులు ఘంటసాల , సుశీల ,   వ్రాసినది ఆరుద్రగారు , సంగీత దర్శకుడు ఎం ఎస్ విశ్వనాథన్ గారు ' అని వినపడుతుండగ,    ' అమ్మా ' అని గట్టిగా బాధతో   అరిచాను . ఆ కేక విన్న అత్త వెంటనే పట్టుకొన్న ట్రాన్సిస్టరును కింద పడవేసి ' ఏమయ్యింది కిష్టయ్య ' అని ఆదుర్దాగ అడిగింది . అప్పుడే వెళ్ళుతున్న   పెద్ద తేలు నన్ను కాలి మీద కాటు వేసింది . గుడ్డి దీపము వెలుగులో దాని చూసిన అత్త పిల్లవాడికి తేలు కుట్టిందని చెప్పింది . ఇ